Blog Archive

Tuesday, 13 November 2012

శ్రీ మహాలక్ష్మి అస్తోత్రం

శ్రీ మహాలక్ష్మి అస్తోత్రం :

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108

శ్రీ మహాలక్ష్మి ఆష్టకం

శ్రీ మహాలక్ష్మి ఆష్టకం :

నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 2 ||
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]

Deepavali lakshmi pooja


అష్టలక్ష్మి స్తోత్రం :


ఆదిలక్ష్మిసుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే 
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | 
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే 
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||
ధాన్యలక్ష్మిఅయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే 
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||
ధైర్యలక్ష్మిజయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే 
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | 
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే 
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||
గజలక్ష్మిజయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే 
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | 
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||
సంతానలక్ష్మిఅయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే 
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||
విజయలక్ష్మిజయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే 
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | 
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే 
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||
విద్యాలక్ష్మిప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే 
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే 
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||
ధనలక్ష్మిధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే 
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే 
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||
ఫలశృతిశ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి | 
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||
శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ||

Friday, 19 October 2012

శ్రీకృష్ణ -గీత మాదురి సాంగ్ - గుండెల్లో గోదారి ఆడియో ఫంక్షన్


శ్రీకృష్ణ -గీత మాదురి సాంగ్ - గుండెల్లో గోదారి ఆడియో ఫంక్షన్ 

బ్రమ్హానందం కామెడీ వీడియో


బ్రమ్హానందం కామెడీ వీడియో :

దేవి నవరాత్రులు - వీడియో


దేవి నవరాత్రులు - వీడియో :

దేవి నవ రాత్రులు -వీడియో

దేవి  నవ రాత్రులు -వీడియో

అన్నపూర్ణాదేవి మూడవ రోజు


అన్నపూర్ణాదేవి మూడవ రోజు


"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీనిత్యాన్నదానేశ్వరీ 
సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ 
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"

దసరా ఉత్సవాలలో అమ్మవారిని ఆశ్వియుజ చవితి రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ. అన్నపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్పి, వాక్ సిద్ది, శుద్ధి, భక్తీ శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సర్వ లోకాల పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుంది.
అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం, పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
నైవేద్యం - దధ్ధోజనం
కావలసిన పదార్ధాలు
బియ్యం - కిలో
పెరుగు - లీటర్
ఉప్పు - తగినంత
పచ్చి మిరపకాయలు - ౩
కరివేపాకు - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
ఇంగువ - కొంచెం
ఎండుమిరపకాయలు - రెండు
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - కొద్దిగా
ఆవాలు - రెండు స్పూన్లు
మిరియాల పొడి - చారెడు
వాము - తగినంత
నెయ్యి - ఒక స్పూను
తయారు చేసే పద్ధతి
దధ్ధోజనానికి అన్నం కొంచెం మెత్తగా వండుకోవాలి. నేతిలో  పైన చెప్పిన పదార్థాలు అన్ని వేసుకుని పోపు చేసుకోవాలి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత పెరుగు, ఉప్పు వేసి కలిపితే సరి దద్దోజనం రెడీ.

Wednesday, 17 October 2012

అమ్మవారికి ధూపదీపాలు




దైవారాధనలో ధూపదీపాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఏ పూజ అయినా మొదట వాటితోనే మొదలవుతుంది.
అమ్మవారి పూజకు సమాయత్తం అయినప్పుడు ముందుగా

ఓం ఆర్ద్రాం యః కారిణీ |
యష్టీం సువర్ణాం హేమమాలినీం ||
సూర్యాం హిరణ్మయీం |
లక్ష్మీం జాతవేదో మమావహ ||

అనే మంత్రాన్ని జపించాలి. తర్వాత 

వనస్పతి రసైర్దివ్యైర్ |
గంధాద్ధ్యైహ్ సుమనొహరైహ్ ||
కపిలాఘ్రుత సంయుక్తో |
ధూపోయం ప్రతిగృహ్యతాం ||

అనే శ్లోకాన్ని స్మరించి అగరొత్తులు వెలిగించి అమ్మవారికి భక్తిగా చూపి, మూడుసార్లు తిప్పి స్టాండులో గుచ్చాలి.

గణచ్చక్షు స్వరూపంచ |
ప్రాణ రక్షణ కారకం ||
ప్రదీప్తం శుద్ధ రూపంచ |
గృహ్యతాం పరమేశ్వరీ ||

అనే శ్లోకాన్ని పఠిస్తూ దీపం వెలిగించి "దీపం దర్శయామి" అనుకుంటూ నమస్కరించాలి.

అమ్మవారికి నైవేద్యం సమర్పించు విధానం

                

పేదవాడైన కుచేలుడు సమర్పించిన అటుకులను శ్రీకృష్ణుడు ప్రేమగా అందుకున్నాడు. భక్త కన్నప్ప అందించిన మాంసాన్ని మహాశివుడు నిస్సంశయంగా అందుకున్నాడు. కనుక మనం ఏం అర్పిస్తున్నాం అనేదాని కంటే ఎంత భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్నాం అనేదే ముఖ్యం.
అమ్మవారికి కూడా అంతే. పండో, పాయసమో ఎదైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అవకాశం ఉంటే ఎన్ని పదార్ధాలను అయినా అర్పించవచ్చు.

నానోపహార రూపంచ ||
నానా రస సమన్వితం |
నానా స్వాదుకరం చైవ |
నైవేద్యం ప్రతిగృహ్యతాం ||

అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ నివేదించిన పదార్ధాలపై నీటిని ప్రోక్షించి "సత్యం త్వర్తేనా పరిషించామి అమృతమస్తు.. అమ్రుతోవస్తరణమసి" అంటూ పదార్థాల చుట్టూ ఔపోసనవిధిగా నీరు చిలకరించాలి. తర్వాత 

"ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయస్వాహా 
ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయస్వాహా"


అంటూ ఐదుసార్లు అమ్మవారికి నివేదనము చేసి నమస్కరించాలి. "మధ్యే మధ్యే పానీయం సమర్పయామి" అంటూ నీటిని పదార్థాలపై ప్రోక్షించాలి. "ఉత్తరాపోసనం సమర్పయామి", "హస్తౌ ప్రక్షాళయామి", "పాదౌ ప్రక్షాళయామి", "శుద్ధ ఆచమనీయం సమర్పయామి" - ఇలా పలుకుతూ నాలుగుసార్లు నీటిని సపర్పించాలి.

దేవీనవరాత్రుల విశిష్టత - ప్రాముఖ్యత


దేవీనవరాత్రుల విశిష్టత
ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ" గుర్తుకు రావటమే! అమ్మ అంటే మరి ఎవరోకాదు ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో వున్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది.

ఈ సృష్టిలోగల జ్యోతిర్మండలాలు మానవనిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగానూ, పరాశక్తిగానూ, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.
శ్లో!! సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వీయుజమాసంలోని  శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈదేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి మూడురోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.

దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గములేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.

ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కోరోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కుష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయనీ
7. కాళరాత్రి
8. మహాగౌరి
9. సిద్ధిధాత్రి
అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవీ "శ్రీకృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోఢశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పాముద్ర పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో
శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!
అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.

అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆదేవదేవికి పూజలతోపాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము.

గాయత్రీ దేవి రెండో రోజు ప్రసిస్త్యం

 "ముక్తా విద్రుమ హేమనీల 
ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:
యుక్తామిందు నిబద్ధరత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాంకుశమ్
కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద
యుగళం హసైర్వాహంతీం భజే" 


సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్"అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.


నైవేద్యం - అల్లం గారెలు 
కావలసిన పదార్ధాలు 
మినప్పప్పు - అరకిలో
పచ్చిమిరపకాయలు - ఆరు
ఉల్లిపాయలు - రెండు
అల్లం - 100 గ్రాములు
జీలకర్ర - రెండు టీ స్పూన్లు
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా


తయారు చేయు విధానం

నానబెట్టిన మినప్పప్పును పల్చగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలిఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలుపచ్చిమిరపకాయ ముక్కలుఅల్లం ముక్కలుజీలకర్రసన్నగా తరిగిన కరివేపాకుఉప్పు వేసి కలుపుకోవాలిమూకుట్లో నూనె కాగనిచ్చి గారెలు వేసుకోవాలి.

అమ్మవారి శిరోజాల రహస్యం

                                                          

మనందరికీ జుట్టంటే మహా ఇష్టం. ఆడవాళ్ళకయితే మరీను. కేశాలను రకరకాలుగా తీర్చిదిద్దుకుంటూ అందాన్ని పెంచుకుంటారు. ఇంతకీ ఈ జుట్టు ఎలా వచ్చింది? వెంట్రుకల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పురాణాల్లో దీని గురించి చెప్పే కధ ఒకటుంది.

మొదట తలమీద జుట్టు అనేది అసలు ఉండేది కాదట. అమ్మవారు తలపై సర్పాలను అలంకారంగా ఉంచుకునేవారట. ఆ పాములు తమ కోరలతో శిరస్సును గట్టిగా పట్టుకుని ఉండేవట. అమ్మవారిని దర్సిమ్చికోడానికి వెళ్ళిన వాళ్ళంతా దేవి తలపై ఉన్న పాములను చూసి భయపడేవారట. అది చూసిన అమ్మవారు జాలిపడి పాములను సన్నటి దారాలుగా మార్చేశారట.. అవే శిరోజాలన్నమాట. వాటిని చూసి ముచ్చటపడిన భక్తులు తమకూ తలపై కేశాలు మొలవాలని కోరుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరిక నెరవేరింది.

పాములే వెంట్రుకలుగా మారాయి అనడానికి చిన్న నిదర్శనం ఏమంటే ఏ వెంట్రుకను లాగి చూసినా, దాని మొదలు భాగం తెల్లగా కనిపిస్తూ, రెండుగా చీలి ఉంటుంది. అవి పాము కోరలకు చిహ్నాలుగా అలాగే మిగిలి ఉన్నాయని చెప్తారు. బాప్రే.. అంటే మన తలపై ఉన్నవి పాముల ప్రతిరూపాలా? ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు అయ్యాయి కదూ! కావా మరి?!

హిట్ కోసం జాగ్రతలు తీసుకుంటున్న బాలకృష్ణ :




                                                    

సింహ విజయం తరువాత బాలకృష్ణ కు ఆ రేంజ్ హిట్ రాలేదు .ఇప్పుడు కొంచం గ్యాప్ తీసుకొని దూకుడు రచయితలు కోన వెంకట్,గోపి మోహన్ అందిచిన ఒక కథ లో బాలకృష్ణ
నటించబోతున్నారు. ఈ విషయం తెలిసిన ఫాన్స్ కూడా చాల కుషి గ ఉన్నారు.
ఈ సినిమా సిని చరిత్ర లో ఒక పెద్ద హిట్ గా నిలవాలని ఆశిద్దాం.

చిలుక - కాకి నీతి కథ


అనగనగా ఒక ఊరిలో ఒక రామ చిలుక ,కాకి ఉన్నాయంట.. అవి రెండూ స్నేహితులు..
అయితే చిలుకచురుకైనది …కాకి బద్దకస్తురాలు..ఒక రోజు రెండింటికి బాగా ఆకలి వేసింది..
అక్కడ దగ్గరలో ఉన్న జామ చెట్టు పై వాలి మంచి జామ కాయ కోసం వెతకడం మొదలు పెట్టాయి..
చిలక ఓర్పుగా అన్నీ వెదికి ఒక పండు జామకాయను తెచ్చుకుంది..కాకి బద్ధకం
తో ఒక పచ్చిజామను కోసుకుంది.. అయితే చిలుక తెచ్చిన పండిన జామను చూడగానే కాకి నోరు ఊరింది…
ఎలాగైనా అది దొంగిలించి తినేయాలనే ఆశ కలిగింది.. అందుకని చిలుకతో” బాగా అలసిపోయాం కదా స్నానం చేసి తిందామా” అంది.. పాపం అమాయకపు
చిలుక “మరి స్నానం చేస్తే ఎవరు మన జామకాయలకు కాపలా కాస్తారు” అని అడిగింది..
“ముందు నువ్వు చేసిరా నేను కాపలా కాస్తాను,తరువాత నేను స్నానం చేస్తాను నువ్వు
కాపాలా కాద్దువు” అని కాకి చిలకతో అంది..చిలుక అంగీకరించి కాకి కి తన జామకాయను
అప్పగించి వెళ్లి పోయింది..

kids moral stories- పిచ్చుక పిల్ల


అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక పిల్ల ఉంది..అది అల్లరిది ..దానికి తొందరెక్కువ..చెప్పిన మాట వినదు..ఒకరోజు  దానికి పరమాన్నం తినాలనే కోరిక పుట్టింది.. అది అమ్మ దగ్గరకు వెళ్లి దాని కోరిక చెప్పింది.. పరమాన్నానికి పాలు,బెల్లం,జీడి పప్పు ,నెయ్యి అన్నీ కావాలమ్మా,నాన్న రాగానే వండుతా అని చెప్పింది అమ్మ..అయినా సరే ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి ఏడుపు మొదలు పెట్టింది పిచ్చుక పిల్ల. చేసేది లేక వాళ్ళ అమ్మే అన్నీ తెచ్చుకుని వంట మొదలు పెట్టింది..

వంట చేస్తున్నంత సేపు పిచ్చుక ఎప్పుడు పెడతావ్? ఎప్పుడు అవుతుంది ?అని అమ్మను విసిగించడం మొదలు పెట్టింది..పరమాన్నం వండి చిన్న గిన్నెలో దానిని వేసి వేడిగా ఉంది కొద్ది సేపు ఆగమ్మా అని చెప్పింది తల్లి ..లేదు లేదు నేను ఇప్పుడే తింటాను అని ముక్కు  పెట్టింది పిచ్చుక .. దానికి బాగా కాలింది.. అది ఏడుస్తూ కూర్చుంది …

moral stories in telugu for kids

Moral stories for kids

kanakadurga devi ammavaru

navarathri -alankaralu

telugu beauty tips

navarathri special - cream salad


navarathri specials- save kamadi


Wednesday, 10 October 2012

Best love song- chinukula rali

Chinukula rali song :

sindoora puvva song

excelent melody song- sindoora puvva 

super hit song from sitharama kalyanam

balakrishna super hit song :


super hit song from gandivam

Goruvanka valaganay gopuraniki song from gandivam:


super hit song from aswametham


aswametham song:

parameswara swaroopam sai baba...


పరమేశ్వర స్వరూపం 'సాయిబాబా'
నడి సంద్రంలో నావలాంటి మన జీవితాలకు దారిచూపి దరిచేర్చేది సద్గురువే. అదృష్టం కొద్దీ మనకు బాబా వంటి సద్గురువు లభించారు. బాబాను మనస్పూర్తిగా నమ్మితే, బాబా మన మనోభావాల్లోని తప్పొప్పులు గ్రహించి దిద్దుతారు. మనఃచాంచల్యాలను పటాపంచలు చేస్తారు. మానసికంగా మనలో మార్పు కలిగేలా వేలుపట్టి నడిపిస్తారు.

మేఘశ్యాముడు హరివినాయక సాఠే ఇంట వంట బ్రాహ్మణుడు. అతనికి శివుడు తప్ప మరో దైవం తెలియదు. షిర్డీలో ఉండే బాబా శివుని అవతారమేనని, వెళ్లి దర్శించుకోమని సాఠేచెప్పటంతో మేఘశ్యాముడు షిర్డీకి బయల్దేరాడు. దారిలో ఎవరో బాబా మహమ్మదీయుడని అనగా విన్నాడు. మసీదులో అడుగుపెట్టాడే కానీ, బాబా మహమ్మదీయుడనే భావన అతన్ని వదల్లేదు. బాబా మేఘశ్యామున్ని చూస్తూనే 'వెధవని తన్ని తరిమేయండి' అని కేకలు వేశారు.

"నువ్వు మేలు జాతి బ్రాహ్మణుడివి. నేను తక్కువ జాతి మహమ్మదీయుడిని. పో...పో...నీ కులం, జాతి మైలపడిపోతాయి." బాబా ఆగ్రహంతో మేఘశ్యాముడి మనసు చెదిరింది. త్యంబక్ వెళ్లి కొన్నాళ్లు గడిపాడు. కానీ, మనసు కుదిటపడలేదు. షిర్డీ వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని మన్నించారు.

షిర్డీలోని దేవతలందరినీ పూజించాక చివరిగా బాబాను దర్శించుకుని, పాదసేవ చేయటం మేఘుడికి అలవాటు. ఒకరోజు ఖండోబా మందిరానికి వెళ్లగా తలుపులు  మూసి ఉన్నాయి దీంతో చేసేది లేక మేఘుడు బాబా పూజకు సిద్దమయ్యాడు. "ఖండోబా వాకిలి తెరిచే ఉంది. వెళ్లి నీ పూజ చేసుకుని రా" అని బాబా అతన్ని వెనక్కి పంపారు. భక్తుల మనోభీష్టాలను నేరవేర్చటమే కదా భగవంతుని కర్తవ్యం.

ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబాను గంగాజలంతో అభిషేకించాలనుకున్నాడు. "శిరసును కొద్దిగా తడిపితే చాలు. మొత్తం శరీరం తడపకు" అని షరతు పెట్టి బాబా అతని అభిషేకానికి అనుమతించారు. మేఘుడు ఆ విషయాన్నే మరిచి 'హర గంగే హర గంగే' అంటూ మొత్తం బాబా శరీరంపై నీళ్లు కుమ్మరించాడు. ఆశ్చర్యం! బాబా తల మాత్రమే తడిసింది. శరీరమంతా పొడిగా ఉంది.

ఒకరోజు బాబా మేఘుడికి కలలో కనిపించి అక్షతలు చల్లి, 'త్రిశూలం గీయి' అని చెప్పారు. మేఘుడు కళ్లు తెరిచేసరికి బాబా కనిపించలేదు. కానీ అక్కడ అక్షతలు చల్లి ఉన్నాయి. వెంటనే బాబా వద్దకు వెళ్లి తన కళ గురించి చెప్పాడు.

"అది కళ కాదు. నిజమే. నా నిజ రూపాన్నే నువ్వు చూశావు. వెళ్లి త్రిశూలం గీయి" అని బాబా ఆజ్ఞాపించారు. మర్నాడు పూణా నుంచి వచ్చిన మరో భక్తుడు బాబాకు శివలింగాన్ని కానుకగా ఇచ్చాడు. పక్కనే నిల్చున్న మేఘుడికి బాబా ఆ లింగానిచ్చి "నీ శివుడు వచ్చాడు జాగ్రత్తగా పూజించు" అని చెప్పారు.

మేఘశ్యాముడికి సర్వం బాబానే. శివుడే తన దేవుడని, బాబా మహామ్మదీయుడని రకరకాల భావాల్తో షిర్డీ వచ్చిన అతనిలో మానసికంగా గొప్ప మార్పు కలిగింది. బాబానే సర్వస్యమయ్యారు. చివరకు అతని ఇష్టదైవమైన శివుడిని బాబా అతని చేతుల్లో పెట్టారు.

అందరూ ఒక్కటే. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. రూపాలు వేరైనా భగవత్ స్వరూపం ఒక్కటే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భేషజాలు, భేదాలు వద్దని చెప్పటానికే బాబా ఈ లీలను చాటారు. అంత్యకాలంలో మేఘుడు బాబా చెంతనే ప్రాణాలు వదిలాడు. బాబా సాధారణ మనిషిలా అతని కోసం విలపించారు. శ్మశానం వరకు వెళ్లి మేఘుడు మృతదేహానికి బాబా సంస్కారాలు జరిపించారు.

about lord sai baba


సాయితత్వం
శిరిడీలో పాడుబడ్డ మసీదులో చాలా సంవత్సరాలు నివసించి పిచ్చి ఫకీరుగా కనిపించిన మహా యోగి, పరమాత్మ, సచ్చిదానంత స్వరూపుడు శ్రీసాయినాథుడు. సాయి ఫకీరేనా లేక నిజంగా పరమాత్మా అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అంతా మాయ.. సాయి లీలామృతం. దీన్నే శాంబరీ విద్య అంటారు. విష్ణుసూక్తంలోని 5వ శ్లోకంలో ఈ శాంబరీ విద్యగురించి విశదంగా వివరణ ఉంది. "ఇంద్రా విష్ణూ దృంహితాః శంబరస్య..."అంటూ ఇచ్చిన వివరణను అవగతం చేసుకోగలిగితే అతరార్ధం బోధపడుతుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కనిపించడమే మాయ. ఆ మాయనుంచి తప్పించుకోవడం బ్రహ్మాదులకుకూడా సాధ్యం కానిపని. కానీ.. అతి శునిశితంగా గమనించగలిగే మాత్రం సాధువులను గుర్తుపట్టడం సాధ్యమే.. దానికి తపోనిష్ట, సంకల్పబలంకూడా కావాలి.

భగవద్గీతలో 7వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో "దైవీ హ్యేషాగుణమయీ మమ మాయా దురత్వయాం.." అంటూ భగవానుడు తన మాయ త్రిగుణాత్మకమైనదని చెప్పుకొచ్చాడు. అలౌకికమైన ఆ మాయను అధిగమించడం ఆయా అవతారాల్లో స్వయంగా ఆయనకికూడా సాధ్యం కాలేదుమరి. అందువల్లే చాలామంది శిరిడీ సాయినాధుడికి చాలా దగ్గరగా ఉండికూడా ఆయనను గుర్తించలేకపోయారు. మాయామోహాన్ని జయించి సర్వం పరమాత్మ తత్వమే అని గుర్తెరిగినవాళ్లు మాత్రం సాయి లీలల్ని ఆస్వాదించగలిగారు.

గుర్తించలేనివారికి సాయి ఓ ఫకీరు. పిచ్చివాడు. అగ్గిపుల్లలు, నాణేలతో ఆడుకుంటూ, మాసిన బట్టలతో తిరుగుతూ, పాడుబడ్డ మసీదులో ఉంటూ, ఊదీ పాటను పాడుకుంటూ సాయి చేసిన విచిత్రమైన లీలలు.. గుర్తించగలిగినవాళ్లకి మాత్రం ఎన్నో అంతరార్ధాల్ని విడమరిచి చెప్పాయి. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ, గాల్లో చేతులు ఆడిస్తూ తెలియనిలోకాలవైపుచూస్తూ సాయి చేసే విచిత్రమైన చేష్టల వెనక ఎన్నో లీలలు ఉండేవి.

తనను చూసేందుకు వచ్చిన వాళ్లదగ్గర దక్షిణ అడిగిమరీ పుచ్చుకుని సాయి వాళ్లను పునీతుల్ని చేసేవాడు. రోజూ శిరిడీ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ తనకు భిక్షవేసినవాళ్ల పాపాల్ని కడిగేసేవాడు. ఓ వ్యక్తి.. సాయీ నిన్ను అందరూ పిచ్చివాడంటున్నారు. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని నేరుగా అడిగాడు.. అప్పుడు సాయి నాథుడు.. అలా అనుకునే వాళ్లే పిచ్చివాళ్లంటూ ఆయనకు సమాధానం చెప్పాడు.

నిజానికి సాయి దేవుడే అయితే మరి ఎప్పుడూ అల్లా అచ్ఛాకరేగా అనడం ఎందుకు? అన్న సందేహం కూడా చాలా మందికి కలిగింది. అలాంటి సందేహాలు ఎన్నింటికో సాయి ప్రత్యక్షంగా లీలల్ని చూపి సరైన సమాధానం చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ నమ్మిన భక్తులకు నాయకుడై కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటున్నాడు.

Subrahmanyashtakam

సుబ్రహ్మణ్యాష్టకం:

 

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీసుముఖ పంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

దేవాధిదేవసుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్యమృదుపంకజమంజుపాద
దేవర్షి నారద మునీంద్రసుగీత కీర్తే
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

నిత్యాన్నదాన నిరతాఖిలరోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమప్రణవాచ్యనిజస్వరూప
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

క్రౌ చామరేంద్రమదఖండనశక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీ కుండలీశధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

దేవాధిదేవ రధమండల మధ్య వేద్య
దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

హారాదిరత్న మనియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారకజయామర బృంద వంద్య
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

పంచాక్షరాదిమను మన్త్రితగాంగ తోయై
పంచామృతై: ప్రముదితేంద్రముఖై ర్మునీంద్రై
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

శ్రీ కార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృతదుష్టచిత్తమ్
నిక్త్వాతు మామవ కళాధర కాంతకాన్త్వా
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమా
తేసర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదమ ప్రాతరుర్దాయ యః పఠేత్
కోటి జన్మ కృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి

ఇతి సుబ్రహ్మణ్యాష్టకమ్