Blog Archive

Wednesday, 17 October 2012

kids moral stories- పిచ్చుక పిల్ల


అనగనగా ఒక ఊరిలో ఒక పిచ్చుక పిల్ల ఉంది..అది అల్లరిది ..దానికి తొందరెక్కువ..చెప్పిన మాట వినదు..ఒకరోజు  దానికి పరమాన్నం తినాలనే కోరిక పుట్టింది.. అది అమ్మ దగ్గరకు వెళ్లి దాని కోరిక చెప్పింది.. పరమాన్నానికి పాలు,బెల్లం,జీడి పప్పు ,నెయ్యి అన్నీ కావాలమ్మా,నాన్న రాగానే వండుతా అని చెప్పింది అమ్మ..అయినా సరే ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి ఏడుపు మొదలు పెట్టింది పిచ్చుక పిల్ల. చేసేది లేక వాళ్ళ అమ్మే అన్నీ తెచ్చుకుని వంట మొదలు పెట్టింది..

వంట చేస్తున్నంత సేపు పిచ్చుక ఎప్పుడు పెడతావ్? ఎప్పుడు అవుతుంది ?అని అమ్మను విసిగించడం మొదలు పెట్టింది..పరమాన్నం వండి చిన్న గిన్నెలో దానిని వేసి వేడిగా ఉంది కొద్ది సేపు ఆగమ్మా అని చెప్పింది తల్లి ..లేదు లేదు నేను ఇప్పుడే తింటాను అని ముక్కు  పెట్టింది పిచ్చుక .. దానికి బాగా కాలింది.. అది ఏడుస్తూ కూర్చుంది …


చెప్పిన మాట వినవు కదా అని అమ్మ దానికి చల్లార్చి ఇచ్చింది.. అయినా పిచ్చుకకు  బుద్ది రాలేదు… నేను బయటకు వెళ్లి తింటాను అని మళ్లీ గొడవ మొదలు పెట్టింది.. వద్దమ్మా..నువ్వు చిన్న పిల్లవు..నీకు లోకం తీరు తెలియదు అని అమ్మ ఎంత చెప్పినా వినలేదు..

దాని గిన్నె ముక్కుతో పట్టుకుని ఒక పెద్ద చెట్టు పై కూర్చుని  తినడం మొదలు  పెట్టింది.. ఎక్కడినుండో ఒక కాకి వచ్చింది.. ఓయ్ ఆ గిన్నె నాకు ఇచ్చి వెళ్ళిపో అని పిచ్చుక పై అరిచింది కాకి.. ఇది మా అమ్మ వండింది నేను ఇవ్వను అని పిచ్చుక గొడవ చేసింది.. ఆ పెనుగులాటలో మొత్తం క్రింద ఇసుకలో పడిపోయింది … కాకి కి కోపం వచ్చి పిచ్చుకను ముక్కుతో బాగా పొడిచి గాయ పరచి వెళ్ళిపోయింది.. పిచ్చుకకు బుద్ది వచ్చింది.. అమ్మ దగ్గరకు ఏడుస్తూ వెళ్ళింది..  అందుకే పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి…

No comments:

Post a Comment