Showing posts with label anushka is under cover. Show all posts
Showing posts with label anushka is under cover. Show all posts

Tuesday, 11 September 2012

డమరుకం ఆడియో ఫంక్షన్ కి రాని అనుష్క

                                                       

అందాల అనుష్క ఈ మధ్య తెలుగు సినిమాలు ఎలాగూ ఒప్పుకోవడంలేదు. చాలాకాలం క్రితం ఆమె అంగీకరించిన సినిమాలే ఇప్పుడు విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాల ఆడియో విడుదల వేడుకలోనైనా అనుష్కను చూడవచ్చని అనుకున్న అభిమానులకి నిరాశే మిగులుతోంది. నిన్న జరిగిన 'డమరుకం' ఆడియో విడుదలకి ఆమె హాజరు కాకపోవడం అభిమానుల మనసుకి కష్టం కలిగించింది. నాగ్ ఫ్యాన్స్ కూడా తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. అనుష్క అగ్ర కథానాయికగా నిలదొక్కుకోవడం వెనుక నాగార్జున ప్రోత్సాహం ఎంతో ఉంది.