అందాల అనుష్క ఈ మధ్య తెలుగు సినిమాలు ఎలాగూ ఒప్పుకోవడంలేదు. చాలాకాలం క్రితం ఆమె అంగీకరించిన సినిమాలే ఇప్పుడు విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాల ఆడియో విడుదల వేడుకలోనైనా అనుష్కను చూడవచ్చని అనుకున్న అభిమానులకి నిరాశే మిగులుతోంది. నిన్న జరిగిన 'డమరుకం' ఆడియో విడుదలకి ఆమె హాజరు కాకపోవడం అభిమానుల మనసుకి కష్టం కలిగించింది. నాగ్ ఫ్యాన్స్ కూడా తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. అనుష్క అగ్ర కథానాయికగా నిలదొక్కుకోవడం వెనుక నాగార్జున ప్రోత్సాహం ఎంతో ఉంది.
అందువల్ల ఆమె తప్పక ఈ సినిమా ఆడియో విడుదలకి వస్తుందని అందరూ భావించారు. అయితే ఆమె మాత్రం ఈ సినిమాను ప్రత్యేకంగా భావించకుండా,తన సహజమైన ధోరణిలోనే డుమ్మా కొట్టింది. ఇప్పటికే కథానాయికలు సినిమాల ప్రమోషన్ విషయంల్లోను ... ఆడియో వేడుకల్లోను పాలుపంచుకోవడం లేదంటూ దాసరి వంటి ప్రముఖులు చాలా సార్లు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అయినా ఎవరిలోనూ ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఇక అనుష్క ధోరణి చూస్తుంటే ఆమెకి తెలుగు సినిమాల్లో చేయాలనే ఉద్దేశం బొత్తిగా లేదన్నట్టు తెలిసిపోతోందని అంతా అనుకోవడం గమనించదగిన విషయం.
No comments:
Post a Comment