Blog Archive
Showing posts with label telugu film news. Show all posts
Showing posts with label telugu film news. Show all posts
Wednesday, 10 October 2012
Tuesday, 11 September 2012
విమర్శలు పట్టించుకోవలసిన పని లేదు అన్న అల్లు అర్జున్
సినిమా అనేది కేవలం ఓ వినోద సాధనం ... సాధారణ ప్రేక్షకులను సైతం అలరించడం దాని ముఖ్య ఉద్దేశం. అందువల్ల అలాంటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తనపని తాను చేసుకు పోతుంటాననీ, క్రిటిక్స్ కోసం తాను సినిమాలు చేయనని అల్లు అర్జున్ అన్నాడు. క్రిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే బిజినెస్ జరగదనీ, వాళ్లు ఎంతగానో అభినందించిన 'వేదం' చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లను రాబట్టలేక పోయిందని చెప్పాడు.
డమరుకం ఆడియో ఫంక్షన్ కి రాని అనుష్క

అందాల అనుష్క ఈ మధ్య తెలుగు సినిమాలు ఎలాగూ ఒప్పుకోవడంలేదు. చాలాకాలం క్రితం ఆమె అంగీకరించిన సినిమాలే ఇప్పుడు విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాల ఆడియో విడుదల వేడుకలోనైనా అనుష్కను చూడవచ్చని అనుకున్న అభిమానులకి నిరాశే మిగులుతోంది. నిన్న జరిగిన 'డమరుకం' ఆడియో విడుదలకి ఆమె హాజరు కాకపోవడం అభిమానుల మనసుకి కష్టం కలిగించింది. నాగ్ ఫ్యాన్స్ కూడా తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. అనుష్క అగ్ర కథానాయికగా నిలదొక్కుకోవడం వెనుక నాగార్జున ప్రోత్సాహం ఎంతో ఉంది.
Friday, 7 September 2012
పవన్ కళ్యాణ్ తో నటించనున్న కాజల్
అన్నీకుదిరితే పవన్ కళ్యాన్ జోడీగా కాజల్ అలరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'జులాయి' సినిమా సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను పవన్ కళ్యాన్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన సిద్ధం చేసుకున్న కథ విన్న పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జల్సా' చిత్రం ... ఇటీవల వచ్చిన 'జులాయి' చిత్రం ఈ రెండు కూడా ఘన విజయాలను సాధించాయి.
ఈ రెండింటిలోను కథానాయిక ఇలియానా కావడంతో, ఈసారి కూడా ఆమెకే అవకాశం ఇవ్వాలని త్రివిక్రమ్ భావించాడు. అయితే బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా డేట్లు సర్దుబాటు చేయలేక పోతోందట. దాంతో కాజల్ ను తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక కాజల్ కూడా ఎన్టీఆర్ ... రామ్ చరణ్ ... మహేష్ బాబు వంటి కథానాయకుల సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయినా ఆమెను సంప్రదించడానికి త్రివిక్రమ్ సిద్ధమౌతున్నాడని అంటున్నారు. కాజల్ గనుక డేట్లు సర్దుబాటు చేయగలిగితే ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఆమేనని అంటున్నారు. ఆల్రెడీ అబ్బాయి జోడీగా హిట్ కొట్టిన కాజల్, అతని బాబాయ్ సరసన చాన్స్ వస్తే వదులుకుంటుందా అనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి.
Subscribe to:
Posts (Atom)