సినిమా అనేది కేవలం ఓ వినోద సాధనం ... సాధారణ ప్రేక్షకులను సైతం అలరించడం దాని ముఖ్య ఉద్దేశం. అందువల్ల అలాంటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తనపని తాను చేసుకు పోతుంటాననీ, క్రిటిక్స్ కోసం తాను సినిమాలు చేయనని అల్లు అర్జున్ అన్నాడు. క్రిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే బిజినెస్ జరగదనీ, వాళ్లు ఎంతగానో అభినందించిన 'వేదం' చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లను రాబట్టలేక పోయిందని చెప్పాడు.
వినోద ప్రధానమైన కథ ... సరదా సన్నివేశాలు ... ఆకట్టుకునే మాటలు ... అలరించే పాటలు ... ఉత్సాహాన్ని నింపే ఫైట్లు ... ప్రేక్షకులు కోరుకునేది వీటినేనని అన్నాడు. బాలీవుడ్ ... కోలీవుడ్ ... టాలీవుడ్ ఇలా ఏ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులైనా, వాళ్లకి కావలసింది కాస్తంత ఎంటర్తైన్మెంట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందుకే తాను ఆ తరహా కథలకి ప్రాముఖ్యతని ఇస్తాననీ, సగటు ప్రేక్షకుడికి కావలసినవి సమపాళ్లలో అందించగలిగితే ఏ సినిమా అయినా విజయవంతమౌతుందని సెలవిచ్చాడు.
No comments:
Post a Comment