అన్నీకుదిరితే పవన్ కళ్యాన్ జోడీగా కాజల్ అలరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'జులాయి' సినిమా సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను పవన్ కళ్యాన్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన సిద్ధం చేసుకున్న కథ విన్న పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జల్సా' చిత్రం ... ఇటీవల వచ్చిన 'జులాయి' చిత్రం ఈ రెండు కూడా ఘన విజయాలను సాధించాయి.
ఈ రెండింటిలోను కథానాయిక ఇలియానా కావడంతో, ఈసారి కూడా ఆమెకే అవకాశం ఇవ్వాలని త్రివిక్రమ్ భావించాడు. అయితే బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా డేట్లు సర్దుబాటు చేయలేక పోతోందట. దాంతో కాజల్ ను తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక కాజల్ కూడా ఎన్టీఆర్ ... రామ్ చరణ్ ... మహేష్ బాబు వంటి కథానాయకుల సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయినా ఆమెను సంప్రదించడానికి త్రివిక్రమ్ సిద్ధమౌతున్నాడని అంటున్నారు. కాజల్ గనుక డేట్లు సర్దుబాటు చేయగలిగితే ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఆమేనని అంటున్నారు. ఆల్రెడీ అబ్బాయి జోడీగా హిట్ కొట్టిన కాజల్, అతని బాబాయ్ సరసన చాన్స్ వస్తే వదులుకుంటుందా అనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి.
No comments:
Post a Comment