Blog Archive

Monday, 27 August 2012

అమెరికాలోను నవ్విస్తున్న సుడిగాడు అల్లరి నరేష్

  తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న 'సుడిగాడు' ... విదేశాల్లోనూ మంచి  వసూలు రాబడుతున్నాడు  .
 అల్లరి నరేష్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా, యూ.ఎస్.ఎ. బాక్సాఫీసు దగ్గర భారీగానే సందడి చేస్తున్నట్టు తెలుస్తోంది. యూ.ఎస్. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే 24.55 లక్షలను వసూలు చేసింది. ఈమధ్య కాలంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ... 'ఈగ' ... 'జులాయి' చిత్రాల తరువాత భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఘనత ఈ సినిమాకే దక్కుతుందని చెబుతున్నారు.
   
   ఇక ఈ సినిమాకన్నా ముందుగా వచ్చిన 'అధినాయకుడు' ... 'ఊకొడతారా ఉలిక్కిపడతారా' ... 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ ఇవ్వలేకపోయాయని అంటున్నారు. ఇక టాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే 5 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. హాస్యానికి పెద్ద పీట వేయడం ... పేరడీ సన్నివేశాలను పక్కాగా తెరకెక్కించడం ... ఆ సన్నివేశాలకి తనదైన శైలిలో నరేష్ జీవం పోయడం ఈ సినిమా విజయానికి మూల కారణమని చెబుతున్నారు.   


No comments:

Post a Comment