Blog Archive

Friday, 31 August 2012

సుడిగాడు సినిమా చూస్తూ ప్రసవించిన ఒక మహిళా

'సుడిగాడు' మామూలోడు కాదు... చాలా తమాషాలు చేస్తున్నాడు. అతను పెట్టే చక్కిలిగింతలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేసుకుంటున్నారు. అంతేకాదు, అలా నవ్వి నవ్విన ఓ మహిళ ధియేటర్లోనే ప్రసవించి, పండంటి బిడ్డకు జన్మనివ్వడం ఇప్పుడు విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన పలమనేరు పట్టణంలో నిన్న ఓ ధియేటర్లో చోటుచేసుకుంది.
    నిండు గర్భిణి అయిన పరిమళ అనే మహిళ 'సుడిగాడు' సినిమా మ్యాటినీ షో చూడడానికి వచ్చింది. సినిమాలో లీనమైన ఆమెకు మధ్యలో నొప్పులు మొదలవడంతో, విషయం తెలుసుకున్న ధియేటర్ యాజమాన్యం సినిమా ప్రోజక్షన్ నిలుపుదల చేసి, డెలివరీకి ఏర్పాట్లు చేసింది. ధియేటర్లోనే ఆమెకు మగ పిల్లవాడు పుట్టాడు. దాంతో ప్రేక్షకులు ఆ చిన్నారికి 'సుడి నరేష్' అంటూ నిక్ నేం పెట్టి అభినందించారు. అనంతరం 108 అంబులెన్సులో పరిమళను సురక్షితంగా పంపించడం జరిగింది.

No comments:

Post a Comment