Blog Archive

Friday, 31 August 2012

క్లీన్ U సర్టిఫికేట్ పొందిన శిరిడి సాయి సినిమా

చాలా రోజుల తర్వాత మళ్లీ అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం 'శిరిడి సాయి' ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుని, క్లీన్ U సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 6 న విడుదల చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి ... ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఆధ్యాత్మిక చిత్రాలు 'అన్నమయ్య' 'శ్రీ రామదాసు' ఘనవిజయం సాధించాయి. అందుకే, తాజాగా వీరు ముగ్గురు కలసి చేసిన 'శిరిడి సాయి' సినిమాపై ప్రేక్షకులకు బారీ అంచనాలే వున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. నాగార్జున అభిమానులతో బాటు శిరిడీ సాయి భక్తులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  

No comments:

Post a Comment