Blog Archive

Tuesday, 11 September 2012

మూడు పువ్వులు ఆరు సినిమాలు గా ఉన్న నాని


                                                


                                             కాలం కలిసొస్తే ఇంట్లో కూర్చున్నా ఇమేజ్ వస్తుందనేది నాని విషయంలో మరో మారు నిజమైంది. చిన్న చిన్న సినిమాలు చేస్తూనే తన పై నిర్మాతలకి నమ్మకం కలిగేలా చేసుకున్న నాని, తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. 'బ్యాండ్ బజా బరాత్' పేరుతో గతంలో బాలీవుడ్ లో వచ్చిన ఓ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.



 దాంతో ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'ఇష్క్ జాదే' ఫేమ్ పరిణతి చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటించనుందని చెబుతున్నారు. విష్ణువర్ధన్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన గోకుల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 'పైసా' ... 'జెండా పై కపిరాజు' వంటి మంచి ప్రాజక్టులు చేస్తోన్న నానీకి ఈ సినిమాతో కాలం కలిసోచ్చినట్టే నని అంటున్నారు. 

No comments:

Post a Comment