Blog Archive

Tuesday, 11 September 2012

యమ సీరియస్ అవుతున్న ఆసిన్


                                                          

ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే మలయాళ ముద్దుగుమ్మ అసిన్ ముఖంలో ఇప్పుడు ఆగ్రహం కనిపిస్తోంది. కోపంతో ఆమె ఊగిపోతోంది. ఎవరి మీద అనుకుంటున్నారు... జర్నలిస్టుల మీద! దీనికి కారణం వాళ్ల రాతలేనట. తాను హిందీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో అమీర్ ఖాన్ తో తనకు లింకు పెట్టి గాసిప్స్ రాశారనీ, ఇటీవల సల్మాన్ తో లింకులు పెడుతున్నారనీ ఈ భామ వాపోతోంది. అంతేకాదు, సల్మాన్ ఖాన్ తో కలిసి సహజీవనం కూడా చేస్తోందంటూ బాలీవుడ్ మీడియా వాళ్లు తన మీద తెగ రాసేస్తున్నారని మండిపడుతోంది.



      అసలు సల్మాన్ తో తన కెలాంటి బంధం లేదనీ, మీడియా తన మీద కక్ష గట్టి ఇలాంటి అబద్ధాలు రాస్తోందనీ అసిన్ అంటోంది. మొదట్లో ఈ వార్తలు చూసి, నవ్వుకుని వదిలేసే దానిననీ, అయితే, ఇప్పుడివి శృతి మించడంతో తాను సీరియస్ అవుతున్నానని ఆమె చెబుతోంది. ఇకపై ఇలాంటి రాతలు రాసే పత్రికలపై కోర్టులో దావా వేస్తానని తాజాగా తన సంతకంతో కూడిన ఓ హెచ్చరిక ప్రకటనను జారీ చేసింది. మరి, ఇప్పుడు బాలీవుడ్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి!  

No comments:

Post a Comment